R1

Hello
RA
నీవంటే ఇష్టం..
నిన్ను గుండెలలో పెట్టుకొని పూజిస్తున్న..
నీవు ఒక్క నిమిషం మాట్లాడిన..
నీకు నీవు నన్ను పలుకరించిన..
నా జీవితం పావనమైనది అని అనుకుంటా..
నీవు తిని పారేసిన చాక్లేట్ కాగితాన్ని..
నీవు తాగి పడేసిన టీ కప్పు ని..
నీవు వాడి పడేసిన రీఫిల్ గొట్టాన్ని..
నీవు తాకిన ప్రతి వస్తువున్ని..
ఎంతో అపురూపంగా పవిత్రంగా దాచు కుంటా..
నీకు చెందిన అన్నింటిని..
నిన్ను ప్రేమించినంతగా ప్రేమిస్తా..
ఇదేనా ప్రేమంటే?..
నిన్నే చూస్తూ..
వెంట నడుస్తూ..
నీకోసం ఏపని చేయడానికైన ముందు ఉంటూ.. నాప్రేమకు..
యస్ చెప్పే చూపు కోసం ఎదురు చూస్తూంటా.. అనుకున్నట్టుగానే ఆ క్షణం వస్తది..
నీవు చూస్తావు..
నేను గుర్రం గా మారా..వచ్చి స్వారి చేయి..
నేను షిప్ లా మారా.. కెప్టెన్ లా నడుపు..
నేను ఇప్పుడు ఫ్లైట్.. పైలెట్ లా నడుపు
అన్నట్టు వుంటుంది..
ఇప్పుడు నీవు నా సొంతం అయ్యావు..
ఇప్పుడు నిన్ను ఎక్కడికి రమ్మనాలి?
నిన్ను ఎక్కడ కలుసుకోవాలి?
నీవు గలగల నవ్వినా..
నీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా
ఏమి మాట్లాడినావు?
నువ్వు ఎందుకు నవ్వినవ్?
అని ఆరా తీస్తా..
ఏ క్షణం ఎటు వెళ్ళినా..
ఏమి చేసిన..
టైమ్ టెబుల్‌ నాకు తెలియాలనిపిస్తుంది..
నా స్వేచ్చను
నీ చేతులలో పెట్టిన..
ఇదేనా ప్రేమంటే?
Hi
NA
ప్రేమంటే..
పారేసిన చాక్లేట్ పేపర్..
తాగేసిన టీకప్పు ను..
వాడేసిన రీఫిల్‌ని ఏరుకోటం కాదురా..
నా గుణ గణాలని ఎరుకోటం..
లోపాలను దాచుకోటం..
ప్రేమంటే..
వెంట తిరగడం కాదురా..
జీవితాంతం వెన్నంటే ఉండటం..

19jan2020a

PRESSLINK:

https://youtu.be/h9MPLXH8F_s

https://youtu.be/5HCgwkVE7HY

https://youtu.be/bs0hOQ4NoEM

2 Corinthians 12: 15
And I will very gladly spend and be spent for you; though the more abundantly I love you, the less I be loved.